లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు

Oct 16 2026 7:23 AM | Updated on Oct 16 2026 7:23 AM

నేటి నుంచి ‘లైఫ్‌లైన్‌’లో ఉచిత వైద్యశిబిరం

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో ఇంపాక్ట్‌ ఇండియా ఆధ్వర్యంలో లైఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం నుంచి ఉచిత వైద్యసేవలు ప్రారంభం కానున్నాయి. ఈ శిబిరంలో కళ్లు, చెవి, ఆర్థోపెడిక్‌, గర్భాశయ సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేయనున్నారు. కలెక్టర్‌ కె.హరిత, జిల్లా వైద్యాధికారి సిడాం నాగేంద్ర, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభిస్తారని ఫౌండేషన్‌ సీనియర్‌ ఆపరేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మనోహర్‌రెడ్డి తెలిపారు. రోగులు తమ వెంట ఆధార్‌కార్డు జిరాక్స్‌లు లేదా ఇతర గుర్తింపు పత్రం తీసుకురావాలని సూచించారు.

చట్టాలపై అవగాహన

వాంకిడి: మండలంలోని ఇందానిలో గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ కార్యదర్శి అనూష మాట్లాడుతూ హక్కులు, చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. పేద ప్రజలు, మహిళలు పిల్లలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అర్హులైన వారు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. మహిళా హక్కులు, బాలల రక్షణ, సామాజిక న్యాయం, ఉచిత న్యాయ సేవలు, పరిష్కార మార్గాలను వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ అంజనీదేవి, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement