కెరమెరి: రాష్ట్రంలోని సమగ్ర శిక్ష, కేజీబీవీ, గిరిజన సంక్షేమ శాఖల్లోని వివిధ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అప్పటి వరకు ఎంటీఎస్ ప్రకటించాలని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆడే ప్రకాశ్ డిమాండ్ చేశారు. నల్గొండలో గురువారం నిర్వహించిన ఆ సంఘ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తరఫున మాజీ జిల్లా అధ్యక్షుడు ఏటుకూరి శ్రీనివాస్తో కలిసి హాజరై మాట్లాడారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె చేసిన కాలానికి వేతనాలు చెల్లించాలన్నారు. జిల్లాలో జీఎస్టీ లేని వ్యాపార సంస్థలు ఉన్నాయని, పాఠశాలల నిధులకు జీఎస్టీ బిల్లులు తేవడం సాధ్యం కాదన్నారు. జిల్లాలో రెగ్యులర్ డీఈవోను నియమించాలని, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.


