చింతలమానెపల్లి: జిల్లాలో బెంగాలీ ప్రజలు నివా సం ఉండే గ్రామాలు అకాలిబోధన్ ఉత్సవాలకు సిద్ధమయ్యాయి. శుక్రవారం నుంచి ఐదురోజులపా టు ఎంతో ఆర్భాటంగా జరుపుకోనున్నారు. పల్లెల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. విగ్రహాలు ఇప్పటికే ముస్తాబు కాగా, ప్రత్యేకమైన తీపి పదార్థాలు రసగుల్లా, రాజ్భోగ్, లాంచా వంటి వంటకాలతో అతిథులు, ప్రముఖులకు ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వనున్నారు. సాధారణంగా దసరా నవరాత్రులపాటు కొనసాగుతాయి. కానీ కాగజ్నగర్ మండలంలోని ఈస్గాం, నజృల్నగర్, నామానగర్, సీతానగర్, సిర్పూర్(టి) మండలం లక్ష్మీపూర్ బెంగాలీ క్యాంప్, చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్– 1, రవీంద్రనగర్– 2 గ్రామాల్లో మాత్రం బెంగాలీలు ఐదురోజులపాటు జరుపుకోనున్నారు.
ఐదురోజలకు ప్రత్యేక విశిష్టత
ఉత్సవాలు నిర్వహించే ఐదురోజలు ఒక్కో విశిష్టతను కలిగి ఉంటాయి. ఈ సమయంలో బెంగాలీలు నిష్టగా ఉంటారు. వినాయకుడు, కార్తికేయుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మహిషాసురుడు, వారి వా హనాలను ఏర్పాటు చేస్తారు. ఈ నెల 16న తొలి రోజు షష్ఠి ఆచారం ప్రకారం వేదపండితుల ఆధ్వర్యంలో అసురుడైన మహిషాసురుడిని పూజిస్తారు. ఘట్స్థాపన, కలశపూజ అనంతరం మిగతా విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. వేదికకు నలుదిక్కులా కలశాలను స్థాపిస్తారు. సాయంత్రం ఆదివస్, ఆమంత్రణ్లతో దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపన పూర్తవుతుంది. 17న సప్తమి నాడు స్థానికులు పూజ, హారతి కార్యక్రమాలకు హాజరవుతారు. 18న ఆదివారం ఈ ఏడాది అధిక సప్తమి పూజలు నిర్వహించనున్నారు. 19న అష్టమిని దుర్గాష్టమిగా పిలుస్తారు. పుష్పాంజలి కార్యక్రమంలో భాగంగా దేవతామూర్తులకు పూలు, పత్రి, అక్షింతలతో అభిషేకం చేస్తారు. 20న నవమి సందర్భంగా దుర్గామహర్నవమినాడు ప్రత్యేక పూజలు చేస్తారు. 21న విజయదశమినాడు దుర్గాదేవి దశమి పూజ నిర్వహిస్తారు. అనంతరం దేవతా విగ్రహాలకు విసర్జన నిర్వహిస్తా రు. ఈ ఏడాది ఒకేరోజు రెండు తిథులు రావడం, ఒకే తిథి రెండు రోజులు రావడంతో కార్యక్రమాల్లో మార్పులు ఉన్నాయని పండితులు తెలిపారు.
భక్తుల విశ్వాసం..
ఆశ్వయుజ శుక్లషష్ఠినాడు ద్వాపర యుగంలో రాముడు ఈ ఉత్సవాలను ప్రారంభించారని భక్తులు విశ్వాసిస్తారు. 108 కమలాలతో రాముడు పూజ ను ప్రారంభించగా, ఒక కమలం లేక పోవడంతో త న నేత్రాన్ని వినియోగిస్తారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు రాముడికి తిరిగి నేత్రాన్ని ప్రదానం చే శారని బెంగాలీలు నమ్ముతారు. దుష్ట సంహారానికి మారుపేరుగా, లోకకల్యాణం కోసం యాగాలు జరి గిన రోజుగా భావించి దసరారోజు అకాలిబోధన్ పూజ నిర్వహిస్తారు. దుష్టసంహారానికి ఏనుగు మీద వచ్చిన అమ్మవారు తిరిగి పడవ మీద వెళ్లిపోయిందని అందుకే ఉత్సవాల సమయంలో వర్షం కురుస్తుందని పెద్దలు చెబుతుంటారు.


