ఆసిఫాబాద్: గోమాతకు జాతీయ మాత హో దా కల్పించాలని గో సమ్మాన్ రాష్ట్ర ఇన్‌చార్జి సంకాదిక్ దాస్ కోరారు. గో సమ్మాన్ అభియాన్ మూడో దశలో భాగంగా శనివారం జి ల్లా కేంద్రానికి చేరుకుని విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 17న భాగ్యనగరంలో ‘శ్రీ రాం జయ జయ రాం’ మహామంత్ర జ పం నిర్వహించిన అనంతరం ఆసిఫాబాద్ ము న్సిపాలిటీ స్థాయిలో సేకరించిన గోప్రేమికు ల సంతకాలను ముఖ్య కార్యదర్శికి అందించనున్నట్లు తెలిపారు. గోమాతకు జాతీయ మా త హోదా కల్పించాలనే ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ప్రస్తుతం సంతకాల సేకరణ కొ నసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేశవనాథ ఆలయం వద్ద నిర్వహించనున్న కార్యక్రమానికి జిల్లాలోని గో భక్తులు, ప్రేమికులు అధికసంఖ్యలో హాజ రై విజయవంతం చేయాలని కోరారు. హిందూ సమాజ్ అధ్యక్షుడు రాజేశ్వర్ మసాదే, ప్రతినిధులు ఖాండ్రే విశాల్, ప్రవీణ్ దేశ్‌ముఖ్, గంగిశెట్టి వేణుగోపాల్, ఒరగంటి శ్రవణ్, వెంకన్న, గణేశ్, గో ప్రేమికులు పాల్గొన్నారు.


