లోక్‌ అదాలత్‌లో 1,264 కేసులు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో 1,264 కేసులు పరిష్కారం

Sep 13 2026 12:06 AM | Updated on Sep 13 2026 12:06 AM

ఆసిఫాబాద్‌: లోక్‌ అదాలత్‌ ద్వారా 1,264 కేసులు పరిష్కరించి రూ.2,68,770 జరిమానా విధించినట్లు జిల్లా లీగల్‌ సెల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌ వి.శారదాదేవి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయ భవనంలో శనివారం లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా శారదాదేవి మాట్లాడారు. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకుంటే డబ్బు, సమయం ఆదా అవుతుందని తెలిపా రు. కక్షిదారులు దీర్ఘకాలిక వివాదాలకు స్వస్తి పలకాలని సూచించారు. సాధారణ కేసుల్లో ఒకరి గెలుపు, ఒకరి ఓటమి ఉంటుండడంతో ఇరువర్గాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయ ని, లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కారమయ్యే కే సుల్లో ఇరుపక్షాలు విజయం సాధించినట్లేనని పేర్కొన్నారు. పైగా, స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలు సమసిపోతాయని తెలిపా రు. సీనియర్‌ సివిల్‌ జడ్జి సంకేత్‌ మిత్ర, డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ డి.అనూష, ప్రిన్సిపల్‌ జూని యర్‌ సివిల్‌ జడ్జి అనంతలక్ష్మి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బోనగిరి సతీశ్‌బాబు, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి కిరణ్‌కుమార్‌, డీఎస్పీ అశోక్‌, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement