పనుల ప్రణాళికలకు గ్రామసభలు | - | Sakshi
Sakshi News home page

పనుల ప్రణాళికలకు గ్రామసభలు

Sep 12 2026 12:00 AM | Updated on Sep 12 2026 12:00 AM

● రెండు దఫాలుగా నిర్వహణ ● వీబీజీ రాంజీలో పెరిగిన పనుల సంఖ్య

తిర్యాణి: వలసలు నివారించడంతో పాటు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రూపొందించిన ఉపాధి హామీ పథకం పేరు ఇటీవల వీబీజీ రాంజీగా మార్చారు. దీంతో పాటు గతంలో జాబ్‌కార్డులో కలిగిన కుటుంబాలకు గరిష్టంగా వందరోజుల పనిదినాలే కల్పించగా ప్రస్తుతం వాటిని 125 రోజులకు పెంచారు. పథకంలో భాగంగా 2027–28, 2028–29, 2029–30 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పనుల ప్రణాళికలను సిద్ధం చేయడానికి రెండు దఫాలుగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పనుల ప్రణాళిక

క్షేత్రస్థాయిలో పనుల ప్రణాళిక సిద్ధం చేయడానికి రెండు దఫాలుగా గ్రామసభలు నిర్వహిస్తున్నా రు. మొదటి గ్రామసభలో వీబీ జీ రాంజీ చట్టం ఉద్దేశాలతో పాటు గ్రామానికి సంబంధించిన ప్రగతి నివేదికను చదివి వినిపించడం, గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులు, ఖర్చు వివరాలు తెలియజేయడం, పురోగతిలో ఉన్న పనుల వివరాలను వెల్లడించడం, వీజీ జీ రాంజీలో అనుమతించిన 318 పనుల జాబితాను రైతులకు అర్థమయ్యేలా వివరించడం వంటివి చేపడుతారు. రెండో గ్రామసభలో ప్రతిపాదిత పనిపేరు, లబ్ధి దారుల వివరాలు, అంచనా వ్యయం, గుర్తించిన పనులు, ప్రాధాన్యత సంఖ్య, ఆశించిన ఫలితం వంటి వివరాలను సంబంధిత అధికారులు నమో దు చేసుకుంటారు. పనుల ప్రణాళికలను గ్రామసభలో రూపొందించేందుకు ఇప్పటికే అధికారులతో కూడిన మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఎంపీడీవో లేదా ప్రోగాం అధికారి టీం లీడర్‌ ఒక బృందం, అడిషనల్‌ ప్రోగాం ఆఫీసర్‌ అధ్యక్షతన మరో టీం, ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌ టీం లీడర్‌గా మరో బృందం పని చేయనున్నారు. ఆయా బృందాల్లో టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, పంచాయతీ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. అయితే మూడేళ్లకు సంబంధించి రూపొందించిన ప్రణాళికలో మొదటి ప్రాధాన్యత ఉన్న పనులను 2027–28 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించనున్నారు.

జిల్లా వివరాలు

ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం

మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంఽధించి వీబీ జీ రాంజీ ద్వారా చేపట్టే పనులకు సంబంధించి గ్రామసభల ద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం మొదటి విడత గ్రామసభలు జరుగుతున్నాయి. త్వరలోనే రెండో విడత గ్రామసభలు నిర్వహిస్తాం.

– షాకీర్‌ ఉస్మాని, అసిస్టెంట్‌ ప్రోగ్రాం అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement