ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలి

Sep 12 2026 12:00 AM | Updated on Sep 12 2026 12:00 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్పీఎం క్లబ్‌లో వినాయక మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వినాయక మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. విద్యుత్‌ శాఖ నుంచి అవసరమైన అనుమతులు పొందాలన్నారు. పట్టణంలోని గుంతల మయమైన రోడ్లకు మరమ్మతు చేయించాలని మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించా రు. సమావేశంలో తహసీల్దార్‌ మధుకర్‌, మున్సిప ల్‌ కమిషనర్‌ తిరుపతి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో సీతారాం, తదితరులు పాల్గొన్నారు.

మోడల్‌ గ్రామసభ

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని సిర్పూర్‌(టి) ఏకల వ్వ మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం మోడల్‌ గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నా రు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ జి.రమేశ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ కనికవర్మ, ఉపాధ్యాయులు మనీషా, రవిశంకర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement