ఆకట్టుకున్న ఎస్‌జీఎఫ్‌ క్రీడాపోటీలు | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ఎస్‌జీఎఫ్‌ క్రీడాపోటీలు

Sep 9 2026 11:28 PM | Updated on Sep 9 2026 11:28 PM

జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో బుధవారం జరిగిన జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ క్రీడాపోటీలు ఆకట్టుకున్నాయి. అండర్‌ –14, 17 విభాగాల్లో బాలబాలికలకు అథ్లెటిక్స్‌, ఖోఖో, హ్యాండ్‌బాల్‌ పోటీలు నిర్వహించగా 800 మంది హాజరయ్యారు. అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ హాజరై క్రీడాకారులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. క్రీడలతో శారీరక, మానసిక వికాసం మెరుగుపడుతుందన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారిని ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి రామ్మోహన్‌ తెలిపారు. కార్యక్రమంలో డీఈవో సచ్చిదానందచారి, గ్రంథాయ చైర్మన్‌ అనిల్‌, డీవైఎస్‌వో అశ్వక్‌, డీఎస్‌వో షేకు, పీడీ మీనారెడ్డి, కోచ్‌లు విద్యాసాగర్‌, అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు. – ఆసిఫాబాద్‌రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement