రెబ్బెన: సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘా ల కాలపరిమితి ముగిసినందున యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని టీబీజీకేఎస్ ఏరియా కార్యదర్శి ఓరం కిరణ్ కోరారు. బుధవారం ఖైరిగూర ఓసీపీలో ఇన్‌చార్జి మేనేజర్ విజయ్‌కుమార్ సాహూకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 8న గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కాలపరిమితి ముగి సిందని తెలిపారు. ఇక నుంచి కార్మిక సమస్యల, హక్కుల పరిష్కారంలో అన్ని సంఘాలకు ప్రాతి నిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు సంపతి తిరుపతి, ఏరి యా నాయకులు కాయిత స్వామి, ఆర్గనైజింగ్ కార్యదర్శి సంఘీ ప్రశాంత్, ఫిట్ కార్యదర్శి బొంగు వెంకటేష్, సీనియర్ నాయకులు సంపత్‌రావు, షిఫ్ట్ ఇన్‌చార్జీలు రవి, అబ్దుల్ అజీమ్ పాల్గొన్నారు.


