కెరమెరి: మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో అరకొర మందులతో కాలం వెల్లదీస్తున్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రతిరోజూ 80 నుంచి 100 మంది వరకు ఆస్పత్రికి వస్తున్నారు. ప్యాన్‌టాప్, మెట్రోజిల్, జెల్లోప్రొమైడ్ తదితర అత్యవసర మాత్రలు అందుబాటులో లేవు. ‘సాక్షి’ ఉదయం 9 గంటలకు ఆస్పత్రిని విజిట్ చేయగా, ఎల్‌టీ ఉద్దవ్, సీహెచ్‌వో నాందేవ్ విధుల్లో ఉన్నారు. పీఎంజన్‌మన్ సిబ్బంది ఆలస్యంగా వచ్చి తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లారు. అప్పటికే బీసీ హాస్టల్ విద్యార్థులు, సాధారణ రోగులు వైద్యం కోసం వచ్చారు. ఉదయం 10 గంటల తర్వాత వైద్యుడు, సీహెచ్‌వో, స్టాఫ్‌నర్సులు వచ్చారు. రెండు డాక్టర్, ఫార్మసిస్ట్, వాచ్‌మెన్, నర్సుల పోస్టులు ఖాళీగా ఉండగా, ఇన్‌చార్జీలతో నెట్టుకువస్తున్నారు. ఎనిమిది సబ్‌సెంటర్లలో 16 మంది ఏఎన్‌ఎంలకు 11 మంది పనిచేస్తున్నారు.


