ఆసిఫాబాద్‌అర్బన్: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దహనం చేసి నిరసన తెలిపాయి. ఏఎంసీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాపర్తి మురళి, కౌన్సిలర్ వినోద్ మాట్లాడుతూ శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే శాసన మండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శాసన సభ గౌరవాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు తారీఖ్, భీంరావు, నాయకులు రవీందర్, జక్కన్న, రాంచందర్, మారుతి పటేల్, విశ్వనాథ్, ఇమ్రాన్ హష్మి, అసద్, నారాయణ, మొండి, నాగోరావ్, సంతోష్, రాము, భానుచందర్, ప్రవీణ్‌చారి తదితరులు పాల్గొన్నారు.


