తిర్యాణి: రోడ్డు నిర్మించాలని తిర్యాణి మండలం గుండాల గ్రామస్తులు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు సుమారు 40కిలో మీటర్ల దూరం పాదయాత్ర చేపట్టారు. కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. సరైన రోడ్డు లేక దాదాపు ఆరు కిలోమీటర్ల మేర దట్టమైన అటవీ ప్రాంతం గుండా కాలినడకన వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు దౌలత్‌రావు, రాందాస్, ఓనిరావు తదితరులు ఉన్నారు.


