కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని గిరిజన ఆశ్ర మ పాఠశాల విద్యార్థులకు డీఆర్‌డీవో దత్తారావు సోమవారం డీటీడీవో అంబాజీతో కలిసి యూనిఫాం పంపిణీ చేశారు. డీఆర్‌డీవో మాట్లాడుతూ జిల్లాలోని 14 ఆశ్రమ పాఠశాలల్లో 2,751 మంది విద్యార్థులు ఉండగా, అందరికీ యూనిఫాం క్లాత్ వచ్చిందని తెలిపా రు. ప్రస్తుతం 80 జతలు మాత్రమే పంపిణీ చేశామన్నారు. త్వరలోనే ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫాం అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూ భాస్కర్, వార్డెన్ రామకృష్ణ, హెచ్‌ఎం రాజేంద్ర ప్రసాద్, మెప్మా అధికారులు మోతీరాం, ఏపీఎం ఇందారపు వెంకటరమణ పాల్గొన్నారు.


