ఆసిఫాబాద్: అసెంబ్లీలోకి వెళ్లకుండా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్య గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, ము న్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ అ హ్మద్, కౌన్సిలర్ సాలం, నాయకులు మర్సోకోల సరస్వతి, గంధం శ్రీనివాస్, జాబరే రవీందర్, అహ్మద్ బిన్ అబ్దుల్లా, నిసార్ పాల్గొన్నారు.


