హియరింగ్‌ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

హియరింగ్‌ వేగవంతం చేయాలి

Sep 8 2026 12:47 AM | Updated on Sep 8 2026 12:47 AM

● సర్‌ పరిశీలకురాలు యోగితారాణా

ఆసిఫాబాద్‌: జిల్లాలో హియరింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, సర్‌ పరిశీలకురాలు డాక్టర్‌ యోగితా రాణా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌ కె.హరిత, అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ జాస్తిన్‌ జోల్‌తో కలిసి తహసీల్దార్లతో హియరింగ్‌ ప్రక్రియ, నోటీసుల జారీ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. యోగితా రాణా మాట్లాడుతూ మ్యాపింగ్‌ కాని, అనామలిస్‌ జాబితాలోని ఓటర్లకు నోటీసులు జారీ చేసి హియరింగ్‌ పకడ్బందీగా చేపట్టాలన్నారు. అనామలిస్‌ జాబితాలోని చిన్న చిన్న సవరణలను వెంటనే పూర్తి చేయాన్ని ఆదేశించారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం నుంచి ఓటర్లు వందశాతం ధ్రువపత్రాలు అందించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. కలెక్టర్‌ కె.హరిత మాట్లాడుతూ నోటీసుల జారీపై ఇప్పటికే తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో హియరింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

ఆసిఫాబాద్‌: సర్‌ ప్రక్రియలో భాగంగా హియరింగ్‌ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్‌ అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ బీఎల్‌వోల ద్వారా నోటీసులు అందించి రశీదు తీసుకోవాలన్నారు. ప్రతీ వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, హియరింగ్‌లో భాగస్వాములను చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ కె.హరిత, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 1,05,692 నోటీసులు ఓటర్లకు అందించినట్లు తెలిపారు. ప్రతీ గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement