ఆసిఫాబాద్‌అర్బన్: ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం గణేశ్ మండపాల నిర్వాహకులతో సమగ్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. నిబంధనలకు అనుగుణంగా సౌండ్ సిస్టం వినియోగించాలని, రాత్రి పది గంటలు దాటి తే వాడొద్దన్నారు. ప్రతీ మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని వలంటీర్లను అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ భద్రతపై దృష్టి సారించాలని, ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసుకో వాలని సూచించారు. అత్యవసర సమయంలో 112 కు సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో డీఎస్పీలు అశోక్, వహీదుద్దీన్, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని చట్టపరమైన పరిష్కరించేందుకే ప్రతీ సోమవారం పోలీసు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వా రా మాట్లాడి సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


