విద్యాప్రమాణాలు పెంచేందుకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

విద్యాప్రమాణాలు పెంచేందుకు చర్యలు

Sep 8 2026 12:47 AM | Updated on Sep 8 2026 12:47 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు మరింత మెరుగుపర్చేందుకు చ ర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలను సో మవారం సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ విద్యాప్లస్‌ గురించి విద్యాశాఖ కార్యదర్శి, కలెక్టర్‌ హరితకు వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు సాంకేతికత ఆధారిత, రియల్‌టైం పర్యవేక్షణతో కూడిన బోధనా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే విద్యాప్లస్‌ లక్ష్యమని తెలిపా రు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు గుర్తించి బోధనా విధానాల్లో మార్పులు తీసుకువచ్చి మెరుగైన ఫలితాలు సాధించేందుకు దో హదపడుతుందన్నారు. యోగితా రాణా మా ట్లాడుతూ జిల్లాలో వినూత్న ఆలోచనలతో నూతన విద్యాప్లస్‌ కార్యక్రమం అభినందనీ యమని కొనియాడారు. ఏఐ ఆధారిత బోధ న సహయక వ్యవస్థను వినియోగించడం ఆనందంగా ఉందన్నారు. కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఎంఈవో సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement