ఆసిఫాబాద్: ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఖూనీ చేస్తుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్, హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తోపులాటలో పలువురు నాయకులకు గాయాలయ్యాయని తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇష్టారాజ్యంగా ప్రవర్తించ డం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.


