అపార్‌ ఆలస్యం | - | Sakshi
Sakshi News home page

అపార్‌ ఆలస్యం

Sep 7 2026 2:56 AM | Updated on Sep 7 2026 2:56 AM

● ఇప్పటివరకు 54 శాతమే పూర్తి ● జిల్లాలో కొనసాగుతున్న ప్రక్రియ

కాగజ్‌నగర్‌టౌన్‌: జిల్లాలో విద్యార్థుల ఆటోమెటెడ్‌ పర్మనెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (అపార్‌) ఐడీల జనరేట్‌ 54శాతమే పూర్తయింది. జిల్లాలో 1,208 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 1,01,011 మంది విద్యార్థులుండగా ఇప్పటివరకు 55,159 మంది విద్యార్థులకు అపార్‌ ఐడీలు జనరేట్‌ అయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 54.6శాతం పూర్తయినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థుల డేటాలో లోపాలుండడంతో నమోదు ఆలస్యమైంది. ఈ ఏడాదిలోపు ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.

వివరాల్లో లోపాలతో జాప్యం

అపార్‌ ప్రక్రియలో విద్యార్థుల పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధార్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ వివరాలు పక్కాగా నమోదు చేయాలి. అనేకమంది వివరాలు సక్రమంగా లేకపోవంతో నమోదులో ఆలస్యమవుతోంది. పాఠశాల రిజిష్టర్‌లోని పుట్టిన తేదీ ఆధార్‌లోని తేదీతో సరిపోలడంలేదు. ఇంటి పేర్లు అసంపూర్తిగా ఉండటం, తల్లిదండ్రులు పూర్తి వివరాలు అందించకపోవడమే ఆలస్యానికి కారణమంటున్నారు. అపార్‌ నమోదు పక్రియ పూర్తయిన తర్వాత ప్రతీ విద్యార్థికి జీవితాంతం ఒకే అకడమిక్‌ నంబర్‌ ఉంటుంది. దీని ద్వారా విద్యార్థి ఉన్నత చదువులు, ఉద్యోగాల విషయంలో ఊరట కలుగుతుంది.

నమోదు నిరంతర ప్రక్రియ

అపార్‌ నమోదును వేగవంతం చేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. ముఖ్యంగా కొందరు విద్యార్థుల ఆధార్‌లో పుట్టిన తేదీ వివరాల్లో తప్పులున్నాయి. పాఠశాల రికార్డులు, ఆధార్‌కార్డులో పుట్టిన తేదీ ఒకేలా ఉండడంలేదు. దీంతో నమోదులో జాప్యం జరుగుతోంది. పుట్టిన తేదీ మార్పు చేసుకున్న వారి వివరాలు వెంటనే నమోదు చేయిస్తున్నాం.

– అబిద్‌అలీ, డిస్ట్రిక్ట్‌ ప్లానింగ్‌ కో ఆర్డినేటర్‌

జిల్లాలో అపార్‌ నమోదు ఇలా..

మండలం స్కూళ్లు విద్యార్థులు నమోదు

ఆసిఫాబాద్‌ 135 16,268 9,399

బెజ్జూరు 79 4,617 1,916

చింతలమానెపల్లి 54 4,603 2,031

దహెగాం 59 4,246 2,321

జైనూర్‌ 87 8,103 4,528

కాగజ్‌నగర్‌ 167 23,674 14,655

కెరమెరి 96 5,424 3,148

కౌటాల 59 6,237 2,766

లింగాపూర్‌ 48 1,584 745

పెంచికల్‌పేట్‌ 35 2,362 1,293

రెబ్బెన 71 5,637 3,172

సిర్పూర్‌(టి) 65 6,469 3,636

సిర్పూర్‌(యు) 63 2,823 1,300

తిర్యాణి 95 3,202 1,436

వాంకిడి 95 5,762 2,807

మొత్తం 1,208 1,01,011 55,159

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement