చింతలమానెపల్లి: మండలంలోని గూడెం గ్రామంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న ఒకరిని పట్టుకుని మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు కౌటాల సీఐ సంతోష్‌కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. గూడెం గ్రామానికి చెందిన కుంబారి శంకర్ తన పెరట్లో అక్రమంగా సాగు చేసిన తొమ్మిది గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.9వేలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
కెరమెరి: మండలంలోని శివగూడ గ్రామానికి చెందిన ఆత్రం భీంరావు వ్యవసాయ పొలంలో రెండు గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. పక్కా సమాచారం మేరకు వ్యవసాయాధికారి, గ్రామస్తుల సమక్షంలో పొలంలో తనిఖీ చేయగా రెండు గంజాయి మొక్కలను గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


