రెబ్బెన: వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగిందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకురాలు మర్సుకోల సరస్వతి ఆరోపించారు. బీఆర్‌ఎస్ వారం రోజుల నిరసనలో భాగంగా ఆదివారం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో సింగరేణి కార్మికులకు స్వర్ణయుగంగా ఉండేదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు. తగిన సమయంలో సింగరేణి కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏరియా సీనియర్ సెక్యూరిటీ అధికారి శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు, సర్పంచులు అజ్మీర బాబురావు, ఽభరద్వాజ్, రాజేశ్, సాగర్‌గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ కుందారపు శంకరమ్మ, నాయకులు శంకరమ్మ, అన్నపూర్ణ అరుణ తదితరులున్నారు.


