పైపులైన్‌ లీకేజీ.. నీరు ఎలా అందేది? | - | Sakshi
Sakshi News home page

పైపులైన్‌ లీకేజీ.. నీరు ఎలా అందేది?

Sep 7 2026 2:56 AM | Updated on Sep 7 2026 2:56 AM

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పెట్రోల్‌ పంపు ప్రధాన రహదారికి ఒక వైపున్న మెయిన్‌ పైపులైన్‌కు లీకేజీలేర్పడినందున ఐదు రోజులుగా తాగునీరు వృథాగా పోతోంది. దీంతో రోడ్డు ఒక వైపు బురదమయమైంది. గతంలోనూ ఇదే స్థలంలో లీకేజీ ఏర్పడగా స్థానికులు గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. గతంలో మరమ్మతులు సరిగా చేయనందునే ఇలా తరచూ లీకేజీలు ఏర్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా సమీపంలోని వివిధ షాపులు, హోటళ్లు, ఆస్పత్రులకు వచ్చిపోయే పేషెంట్లు, వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సంబంధిత అధికారులకు పలుసార్లు సమస్య తెలిపినా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. కాగా, ఈ సమస్యపై మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతిని సంప్రదించగా ప్రధాన పైపులైన్‌ లీకేజీతో తాగునీరు వృథాగా పోతున్న మాట వాస్తవమేనని తెలిపారు. వివిధ కారణాలతో మరమ్మతు చేయించడంలో జాప్యం జరిగినట్లు పేర్కొన్నారు. వెంటనే మరమ్మతు చేయించి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement