ఆసిఫాబాద్‌అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ కె.హరిత సూ చించారు. కలెక్టరేట్ నుంచి కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, ఆసిఫాబాద్ ఆర్డీవో లో కేశ్వర్‌రావ్‌తో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. మ్యాపింగ్ కాని, అనామలిస్ జాబితాలో పేర్లున్న ఓటర్లకు హియరింగ్ ప్ర క్రియను వేగవంతం చేసి అవసరమైన ధ్రు వపత్రాలను స్వీకరించాలని సూచించారు. కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
సదరం శిబిరంలో ఏర్పాట్ల పరిశీలన
సదరం శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులకు అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ కె.హరిత సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొనసాగుతున్న సద రం శిబిరాన్ని సందర్శించి సౌకర్యాలు పరిశీ లించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మండలాల నుంచి శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట వైద్యులు, సిబ్బంది, దివ్యాంగులున్నారు.


