కాగజ్‌నగర్‌రూరల్: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు వచ్చిన ఓటర్ల నుంచి వచ్చిన ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులకు తావులేకుండా చూడాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి సూచించారు. శనివారం కాగజ్‌నగర్ మండలంలో ని నజ్రుల్‌నగర్ గ్రామంలో నిర్వహించిన హియరింగ్ కేంద్రాలను పరిశీలించారు. మండలంలోని 14, 17, 111 పోలింగ్ కేంద్రాల్లో హియరింగ్ ప్రక్రియలో ధ్రువపత్రాలను ఎలా పరిశీలిస్తున్నారో తె లుసుకున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూ చించారు. హియరింగ్ సందర్భంగా ఓటర్లకు చెందిన సరైన ధ్రువపత్రాలు, ఫొటోలు మాత్రమే సేకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ మధూకర్, సూపర్‌వైజర్లు, బీఎల్వోలున్నారు.


