ఆసిఫాబాద్: ఆరు గ్యారంటీలతో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పేర్కొన్నారు. వెయ్యిరోజుల ప్రజాపాలనపై కాంగ్రెస్ శ్రేణులు జిల్లా కేంద్రంలో శనివారం సంబరాలు జరుపుకొన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్, కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు గాంధీచౌక్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుగుణ మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. ఏఎంసీ చైర్‌పర్సన్ ఇరుకుల్ల మంగ, డైరెక్టర్ రాంచందర్, మురళి, ఇమ్రాన్, తారిక్, భీమ్‌రావు, శోభన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


