శుద్ధజలం అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

శుద్ధజలం అందించడమే లక్ష్యం

Sep 6 2026 2:31 AM | Updated on Sep 6 2026 2:31 AM

రెబ్బెన: ప్రజలకు శుద్ధజలం అందించేందుకు గ్రా మాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు అడిషన ల్‌ కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ పేర్కొన్నారు. శని వారం వంకులం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు ఆవశ్యకతను పరిశీలించారు. అవసరమైన సదుపాయాల గురించి ఆరా తీశారు. తాగునీటి సదుపాయం అంతంత మాత్రంగా ఉన్న, మిషన్‌ భగీరథ నీటిపైనే ఆధారపడ్డ గ్రామాల్లో ప్రభుత్వం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అతి తక్కువ ధరకే ప్రజలకు ప్లాంట్ల ద్వారా శుద్ధజలం అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అజ్మీర మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement