లింగాపూర్: మండలంలోని మోతీపటార్ గ్రామానికి చెందిన రాథోడ్ కల్యాణి గురువారం విడుదలైన నీట్ ఫలితాల్లో ఎస్టీ కేటగిరి నుంచి 329 ర్యాంక్ సాధించినా పైచదువులకు ఆమెకు పేదరికం అడ్డొస్తోంది. నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన కల్యాణి తండ్రి శ్యాంరావ్ మూడేళ్ల క్రితమే చనిపోయాడు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ఆమె ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. పైగా వ్యవసాయ పనులకు వెళ్తూనే యూట్యూబ్‌లో క్లాసులు వింటూ నీట్ రాసి ఉత్తమ ర్యాంక్ సాంధించింది. నర్సంపేట్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు దక్కించుకుంది. కానీ, పేదరికం ఆమె పైచదువులకు అడ్డొస్తోంది. దాతలెవరైనా సహకరిస్తే కాలేజీలో చేరేందుకు ఎదురుచూస్తోంది. సాయమందించే దాతలు 9391580752 నంబర్‌కు ఫోన్ పే చేయాలని వేడుకుంటోంది.
రాథోడ్ కల్యాణి


