వాంకిడి: బాల్య వివాహాలను అరికట్టాలని, ఇందుకు ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా బాలల సంక్షేమాధికారి బూర్ల మహేశ్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని కేజీబీవీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి హాజరై మాట్లాడారు. బాలికల విద్య, భద్రత విషయంలో మరింత బాధ్యతా యుతంగా వ్యవహరించాల్సిన అవసరముందని తెలిపారు. బాల్య వివాహాల నిరోధక చట్టం–2006పై అవగాహన కలిగి ఉండాలని, బాలికలు తమ సమస్యలను స్వేచ్ఛగా పంచుకునేలా నమ్మకమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఎంఈవో శివచరణ్‌కుమార్, ఎస్వో రైజా ఖాటుమ్, డీసీపీయూ ప్రొటెక్షన్ అధికారి శ్రావణ్‌కుమార్, సూపర్‌వైజర్ పితాంబర్, సంతోష్ తదితరులున్నారు.


