ఆసిఫాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. ‘వెయ్యి రోజుల కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి’ పేరిట బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ హామీలతో ప్లకార్డులు ప్రదర్శించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మ న్ ఆకాశ్, వైస్ చైర్మన్ అహ్మద్, విండో చైర్మన్ అలిబిన్‌అహ్మద్, కౌన్సిలర్లు వెంకన్న, సాలం, భాలకృష్ణ, రాజంపేట సర్పంచ్ పోచన్న, నాయకులు మర్సోకోల సరస్వతి, అహ్మద్‌బి న్ అబ్దుల్లా, గంధం శ్రీనివాస్, సాయి శ్రావణ్, నిసార్, అన్సార్, శ్యామ్ పాల్గొన్నారు.


