ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉందని కలెక్టర్ హరిత పేర్కొన్నారు. శని వారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ యువరా జ్ మర్మాట్, డీఈవో సచ్చిదానంద చారితో కలి సి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జి ల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 38 మందిని శాలువాలతో సత్కరించి ప్ర శంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గురువు దైవంతో సమానమని పేర్కొన్నారు. విద్యార్థులు 100 శాతం బ డికి వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాల ని సూచించారు. జిల్లాలో విద్యారంగం బలోపేతా నికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలి పా రు. అధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


