బస్‌ షెల్టర్లు నిర్మించాలని మంత్రికి వినతి | - | Sakshi
Sakshi News home page

బస్‌ షెల్టర్లు నిర్మించాలని మంత్రికి వినతి

Sep 5 2026 1:50 AM | Updated on Sep 5 2026 1:50 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలోని మండల కేంద్రాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్‌ షెల్టర్‌లు నిర్మించాలని శుక్రవారం హైదరా బాద్‌లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ వినతిపత్రం అందించారు. పలు మండల కేంద్రాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉన్నా ప్రయాణికులు వేచి చూసేందుకు షెల్ట ర్లు లేవన్నారు. ఎండలు, వర్షంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అలాగే బస్సు షెల్టర్లు ఉన్న ప్రాంతాల్లో తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్‌ సదుపాయం, కనీస వసతులు కల్పించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement