అన్నదాతల అరిగోస | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల అరిగోస

Sep 5 2026 1:50 AM | Updated on Sep 5 2026 1:50 AM

‘సిర్పూర్‌’లో 42,867 ఎకరాల పట్టా భూమి నిషేధిత జాబితాలోనే.. న్యాయం చేయకుంటే కలెక్టరేట్‌ ఎదుట రైతులతో వంటావార్పు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కౌటాలలో సమర శంఖం సభ

హక్కులు కోల్పోయి

కౌటాల: సిర్పూర్‌ నియోజకవర్గంలో 42,867 ఎకరాల పట్టా భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంతో బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదని, ఎరువుల బస్తాలు అందడం లేదని.. భూములపై హక్కులు కోల్పోయి అన్నదాతలు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ భూములకు పట్టాలిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి వాటిని లాక్కుంటున్నారని మండిపడ్డారు. కౌటాల మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన సమర శంఖం సభలో కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన, 22ఏ నిషేధిత భూముల జాబితా పై మాట్లాడారు. జిల్లాలోని రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించకుంటే కలెక్టరేట్‌ ఎదుట రైతులతో వంటావార్పు చేపడతామని హె చ్చరించారు. సిర్పూర్‌ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్సీ ఇద్దరూ ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రెండేళ్ల తర్వాత బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వ స్తుందని, అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్‌ న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. అంతకు ముందు పలు వురు రైతులు తమ పట్టా పాసుపుస్తకాలతో హరీశ్‌రావుతో మాట్లాడారు. తమ భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో బ్యాంకు అధికారులు లోన్లు ఇవ్వడం లేదని రైతులు భీంబాయి, విజయలక్ష్మి, మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ వివిధ గ్రామాలకు చెందిన రైతులు వినతిపత్రాలు అందించారు.

రైతులకు లోన్లు ఇవ్వారా..?

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాఘన కంపెనీకి బ్యాంకులు రూ.వేల కోట్ల లోన్లు ఇస్తున్నాయ ని, రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్ర శించారు. ప్రభుత్వ హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు బాధితులు ఫోన్లు చేస్తే డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ఆ రోపించారు. మంత్రి కుమారుడు హైదరాబాద్‌ ప్రాంతంలో వందల ఎకరాలను కబ్జా చేస్తుంటే ప ట్టించుకోకుండా.. అన్నదాతల భూములను నిషేధి త జాబితాలో చేర్చుతున్నారని మండిపడ్డారు. పో డు భూముల కోసం దిందా రైతులు హైదరాబాద్‌కు పాదయాత్రగా వెళ్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించిందని పేర్కొన్నారు.

నా భూమి నిషేధిత జాబితాలోనే..: కోనప్ప

50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న నా పట్టా భూమిని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిషేధిత జాబితా లో చేర్చిందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. సిర్పూర్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన దేవుడు కేసీఆర్‌ అని కొనియాడారు. దేశంలో ఎ క్కడా లేని విధంగా మూతపడిన పేపర్‌ మిల్లును పునఃప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పించారని తెలిపారు. గతంలో ఈ ప్రాంతం నుంచి ఖమ్మం, వరంగల్‌ ప్రాంతానికి ప్రజలు వలస వెళ్లే వారని, ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి పనుల కోసం వస్తున్నారని చెప్పారు. సిర్పూర్‌ ప్రాంతానికి చెందిన రైతుల 42 వేల ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచే తొలగించేలా కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ సభలో ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, నడిపెల్లి దివాకర్‌, దుర్గం చిన్నయ్య, నాయకులు ఎర్రొల్ల శ్రీనివాస్‌, రామ్మోహన్‌రావు, కొంగ సత్యనారాయణ, కౌటాల సర్పంచ్‌ నక్క శంకర్‌, వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement