కాగజ్‌నగర్‌టౌన్: మున్సిపాలిటీ పరిధిలో రూ.5.70 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబులు భూమిపూజ నిర్వహించారు. వార్డు 24లోని బాలాజీనగర్ నుంచి ఖలీద్ కిరాణం వరకు సీసీరోడ్డు రూ.1.50 కోట్లు, వార్డు 11 ఆదర్శనగర్ నుంచి స్విమ్మింగ్ పూల్ వరకు సీసీ రోడ్డు రూ.కోటి, వార్డు 12లో హనుమంత్‌రావు ఇంటి నుంచి ఫకీర్ మొహ్మద్ ఇంటి వరకు సీసీరోడ్డు రూ.1.50 కోట్లు, వార్డు 6లో తాహెర్ ఇంటి నుంచి మసాలా ఒర్రె వరకు సీసీ రోడ్డు రూ.1.70 కోట్లతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. మున్సి పల్ చైర్‌పర్సన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ తిరుపతి పాల్గొన్నారు.


