కాగజ్‌నగర్‌టౌన్: కాంగ్రెస్ పార్టీపై నిందలేస్తే ఊరుకోమని ఎమ్మెల్సీ దండె విఠల్ హెచ్చరించారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరంకు తరలిస్తే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. జగన్నాథ్‌పూర్, బోడపల్లి గ్రామాల్లోని భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టారని గుర్తు చేశారు. సర్పంచులు ప్రలోభాలకు లొంగి చేరుతున్నారని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అనడం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ షాహిన్ సుల్తానా, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, కౌన్సిలర్ జ్యోతి పాల్గొన్నారు.


