తిర్యాణి: ఎలుగుబంటి దాడిలో గాయపడిన శంకర్ వైద్యఖర్చులు అటవీశాఖ అధికారులే భరించాలని మండల జేఏసీ నాయకులు శుక్రవారం మండల కేంద్రంలోని ఫారెస్టు కార్యాలయం ఎదుట రహదారిపై నాలుగు గంటలపాటు రాస్తారోకో చేపట్టారు. జేఏసీ చైర్మన్ మడావి గుణవంత్‌రావు మాట్లాడుతూ అటవీ అధికారులు బాధితుడిని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తామని చెప్పి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం సరికాదన్నారు. వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా అంబులెన్స్ యా క్సిడెంట్ అయ్యిందని, బాధిత కుటుంబంలో ఇద్దరికి గాయాలయ్యాయని తెలిపారు. బాధితులందరికీ నాణ్యమైన వైద్యం అందించాల ని భీష్మించుకు కూర్చున్నారు. ఎస్సై సుబ్బారావు ఘటనాస్థలికి చేరుకుని నచ్చజెప్పారు. మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళ న విరమించారు. తాళ్ల శ్రీనివాస్‌గౌడ్, వెడ్మ భగవంత్‌రావు, శంకర్ గౌడ్, సార రమేశ్‌గౌడ్, పవన్, జైనేని చంద్రశేఖర్ పాల్గొన్నారు.


