కాంగ్రెస్ హామీలన్నీ బూటకమే నియోజకవర్గ నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారు ఆసిఫాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నాం ‘సాక్షి’తో ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్: ‘ప్రభుత్వం పార్టీల ఆధారంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాలపై వివక్ష చూపకూడదు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపట్టాలి. ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉందనే నెపంతో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపుతున్నారు. అయినా నియోజకవర్గంలో ని సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరా టం సాగిస్తా..’ అని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఎమ్మెల్యే మాటల్లోనే.. ఆరు గ్యారంటీల హామీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ వందశాతం అమలు చేయలేదు. రుణమాఫీ ఇప్పటికీ సగం మంది రైతులకు కూడా కాలేదు. వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇప్పటివరకు ఇవ్వలేదు.
నిలిచిన వంతెనలు
గుండి, లక్మాపూర్‌లతో పాటు నిర్మాణంలో ఉన్న ప లు వంతెనల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయా యి. నాణ్యతా లోపంతో ‘అడ’ ప్రాజెక్టు కట్టకు బీట లు వారాయి. అక్కడ ప్లాస్టిక్ కవర్లు కప్పి ఎన్ని రోజు లు నెట్టుకొస్తారు..? నాలుగు నియోజకవర్గాలకు తాగునీరందించే ఈ ప్రాజెక్టుకు కనీసం మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. ఆదివాసీలకు ఒక్క పో డు పట్టా కూడా ఇవ్వలేదు. నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ స్థలాన్ని వాంకిడి మండలం బెండార నుంచి ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి రహదారి వద్ద నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాఠశాల భవనాన్ని జిల్లా కేంద్రానికి వచ్చే హైవే పక్కన అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉద్యమిస్తాం
జిల్లా కేంద్రంలో కొంతమంది మాఫియాగా ఏర్పడి ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ప్లాట్లుగా వి క్రయిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. కలెక్టర్ తక్షణమే దీనిపై దృష్టి సారించాలి. ఈ అక్రమాలపై మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా బిల్లులు రాకపోవడంతో ఇప్పటివరకు సగం కూడా పూర్తికాలే దు. ప్రైవేటు భూములను ప్రభుత్వ భూముల పేరుతో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో సామా న్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు ఇప్పుడు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు.
ప్రభుత్వాన్ని నిలదీస్తా
నాపై ఉన్న నమ్మకం, అభిమానంతో ప్రజలు నన్ను గెలిపించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తాను. ప్రస్తుత ప్రభుత్వ వివక్షతో పనులు అనుకున్నంత వేగంగా చేయలేకపోతున్నాం. త్వరలోనే మా ప్రభుత్వం వస్తుంది.. అప్పుడే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాను. నిధులు ఇవ్వకపోయినా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాను.
బీఆర్‌ఎస్ హయాంలోనే..
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆసిఫాబాద్‌కు మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, ఎస్పీ తదితర కార్యాలయాలు సాధించుకున్నాం. ప్రస్తుతం మెడికల్ కళాశాలలో 150 మంది ప్రొఫెసర్లకు కేవలం 40 మంది మాత్రమే ఉన్నారు. బోధన సిబ్బంది, వైద్యులను ప్రభుత్వం నియమించడం లేదు. ఉద్దేశపూర్వకంగానే వివక్ష చూపుతూ మూడేళ్లుగా ఎమ్మెల్యేలకు కేటాయించే రూ.5 కోట్ల సీడీపీ నిధులను ఇవ్వడం లేదు. ఎస్‌డీఎఫ్ నిధులు కూడా కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే ఇస్తున్నారు. గత బడ్జెట్‌లో రూ.5 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం వాటిని బుట్టదాఖలు చేసింది.
అభివృద్ధి పనులు
కెరమెరిలో రూ.30 కోట్లతో ఇన్‌టెక్ వెల్ ని ర్మించాం. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల నుంచి ఏటా రూ.30 కోట్లతో సీసీ రోడ్లు వేస్తున్నాం. ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. జిల్లా కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద ఆర్చ్, డ్రెయినేజీలు, కల్వర్టులు, మున్సిపల్ కాంప్లెక్స్, కార్యాలయ భవన నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తాం.


