ప్రక్షాళన.. పరిపూర్ణం! | - | Sakshi
Sakshi News home page

ప్రక్షాళన.. పరిపూర్ణం!

Sep 4 2026 2:12 AM | Updated on Sep 4 2026 2:12 AM

ఆబ్కారీ శాఖలో బదిలీల పర్వం ఉమ్మడి జిల్లాలో అన్నిచోట్ల నుంచి.. ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలకు స్థాన చలనం కోరుకున్న చోటకే కొందరికీ ట్రాన్స్‌ఫర్‌! గైడ్‌లైన్స్‌ జారీ చేయలేదని, ఆప్షన్లు కూడా తీసుకోలేదని శాఖలో చర్చ

సంఖ్య సంఖ్య

సాక్షి, ఆదిలాబాద్‌: ఎక్సైజ్‌ శాఖలో సమూల ప్రక్షాళన చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రక్రియ, సాధారణ బదిలీలు అని ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఎలాంటి గైడ్‌లైన్స్‌ జారీ చేయలేదని, ఆప్షన్లు కూడా తీసుకోలేదని శాఖలో ప్రచారం సాగుతోంది. ఆ శాఖ కమిషనర్‌ సి.హరికిరణ్‌ నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దాదాపు అన్ని ఎక్సైజ్‌ స్టేషన్లు, ఇతర విభాగాల నుంచి ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలకు ట్రాన్స్‌ఫర్లు చోటు చేసుకున్నాయి. ఏకంగా ఆదిలాబాద్‌ డివిజన్‌ నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌ డివిజన్లకు బదిలీలు చోటుచేసుకోగా, అక్కడి నుంచి ఉమ్మడి జిల్లాకు పలువురు వచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు దీర్ఘకాలికంగా పనిచేస్తున్నారు. గతేడాదే పలువురికి ప్రమోషన్‌ వచ్చినా పోస్టింగ్‌లు కేటాయించలేదు. తాజాగా పోస్టింగ్‌లు కేటాయించడంతో పాటు బదిలీలు చేపట్టారు. దీంట్లో ఏకంగా ఎక్సైజ్‌ డివిజన్‌ నుంచే బదిలీ చేసి ఇతర డివిజన్లకు పంపించారు. ముందుగా ఎలాంటి గైడ్‌లైన్స్‌ జారీ చేయకుండా, ఆప్షన్‌ ఇవ్వకుండా ఈ ప్రక్రియ చేపట్టారని శాఖలో ప్రచారం జరుగుతున్నా.. జిల్లా నుంచి బదిలీపై వెళ్తున్న కొందరు అధికారులకు ఇతర డివిజన్లలో పలుకుబడి ఉన్నచోట పోస్టింగ్‌ లభించిందనే చర్చ సాగుతోంది. ఒకరోజు ముందు రాత్రి కొంత మంది తమ పరిచయాలు, పైరవీలతో అనువైన చోటకు బదిలీపై వెళ్లారని చెప్పుకొంటున్నారు.

నేరాలను అరికట్టేనా..?

ఉమ్మడి జిల్లాకు సరిహద్దున మూడు దిక్కులా మహారాష్ట్ర ఉంది. ఇక్కడికి అక్కడి నుంచి దేశీ దారు రవాణా విస్తృతంగా సాగుతోంది. జిల్లా నుంచే పలువురు స్మగ్లర్లు దేశీదారు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. దీంతో చీప్‌ లిక్కర్‌ అమ్మకాల విషయంలో రాష్ట్రానికి ఆదాయం తగ్గుతోంది. అంతే కాకుండా గంజాయి సాగు ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. అడపాదడపా పోలీసులు దాడులు చేసి అరికట్టేందుకు కృషి చేస్తున్నా ఎకై ్సజ్‌ శాఖ నామమాత్రంగానే దాడులు నిర్వహిస్తోందనే ఆరోపణలు లేకపోలేదు. గుడుంబా కేసులు కూడా బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ క్రైమ్‌ను అరికట్టేందుకు సమూల ప్రక్షాళన ద్వారా శాఖలో ప్రయత్నాలు చేపట్టారనే ప్రచారం సాగుతోంది.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

ఎక్సైజ్‌ ఆదిలాబాద్‌ డివిజన్‌ పరిధిలో మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలు, 11 ఎక్సైజ్‌ స్టేషన్లున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదిలాబాద్‌, ఇచ్చోడ, ఉట్నూర్‌, నిర్మల్‌ జిల్లాలో నిర్మల్‌, భైంసా, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌, లక్సెట్టిపేట స్టేషన్లున్నాయి. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలో డివిజన్‌ పరిధిలో పనిచేసే ఏసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో పాటు నా లుగు జిల్లాల్లో డీటీఎఫ్‌ విభాగాలున్నాయి. వీటి పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు దీర్ఘకాలికంగా పనిచేస్తున్నారు. వారిని కరీంనగర్‌, నిజామాబాద్‌ డివిజన్లకు బదిలీపై పంపించారు. అక్కడి నుంచి ఈ జిల్లాలకు అధికారులు వస్తున్నారు.

ఉమ్మడి జిల్లా బదిలీ వివరాలు

పోస్టు పేరు బదిలీ అయిన వచ్చేవారి

ఇన్‌స్పెక్టర్లు 16 18

ఎస్సైలు 15 18

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement