గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Sep 4 2026 2:12 AM | Updated on Sep 4 2026 2:12 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేసరి ఆంజనేయులు గౌడ్‌ డిమాండ్‌ చేశారు. గౌడ జన హ క్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువా రం జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ కె.హరిత, ఎకై ్సజ్‌ ఈఎస్‌ లక్ష్మానాయక్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతిపత్రాలు అందించారు. ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో గీత కార్మికుల లైసెన్స్‌లు పునరుద్ధరించాలని, అర్హులకు నూతన లైసెన్స్‌లు మంజూరు చేయాలన్నా రు. జిల్లాలో గీత వృత్తిపై ఆధారపడిన కా ర్మికుల వివరాలు నమోదు చేసి అధికారిక గు ర్తింపు కార్డులు మంజూరు చేయాలని కో రారు. 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్‌ సౌకర్యం, చెట్ల పైనుంచి పడి మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎకై ్సజ్‌శాఖ అధికారులు గీత కార్మికుల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో శంకర్‌గౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, మనోహర్‌గౌడ్‌, నీరజగౌడ్‌, మహేష్‌గౌడ్‌, గిరిగౌడ్‌, తిరుపతిగౌడ్‌, వైకుంఠంగౌడ్‌, అశోక్‌గౌడ్‌, వెంకటేష్‌గౌడ్‌, కృష్ణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement