కాగజ్‌నగర్‌టౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని చి న్నారులు, గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల సేవలు అత్యంత కీలకమని ఎ మ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. కా గజ్‌నగర్ మండలం బారెగూడ పంచాయతీ లో ఎన్‌ఆర్‌ఈజీఎస్, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.12 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రం భవనాన్ని గురువా రం పీడీ స్వరూపారాణి, సీడీపీవో సురేఖ, స ర్పంచ్ కోట వేణుతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అ మలు చేస్తున్న పోషణ్ అభియాన్‌ను గ్రామాలకు చేరవేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ మణిరాజ్, ఉప సర్పంచ్ నేరేళ్ల వెంకటేశ్, పంచాయతీ సెక్రెటరీ నరేష్, వార్డు సభ్యులు వడాయి శ్యామల, ముక్తార్, రుబినా, చిప్పకుర్తి హరీశ్, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.


