ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే రోబోటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికత రంగాలపై అవగాహన అవసరమని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో సోహం అకాడమీ ఆధ్వర్యంలో రోబోటిక్స్, ఏఐ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. పాఠ్య పుస్తకాలకే పరి మితం కాకుండా ప్రయోగాత్మకంగా నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో సచ్చిదానంద చారి, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఎస్‌వో శ్రీనివాస్, ఎంఈవో సుభాష్, ప్రిన్సిపాల్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


