అప్రమత్తతతో సైబర్‌ మోసాలకు అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతో సైబర్‌ మోసాలకు అడ్డుకట్ట

Sep 3 2026 4:09 AM | Updated on Sep 3 2026 4:09 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: అప్రమత్తతతో సైబర్‌ మోసాలతో అడ్డుకట్ట వేయొచ్చని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజేంద్రప్రసాద్‌ బీఈడీ కళాశాలలో బుధవారం సైబర్‌ జాగృత దివస్‌ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. పెట్టుబడి మోసాలు, ఆన్‌లైన్‌, సోషల్‌ మీడియా మోసాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సైబర్‌ నేరాల బారిన పడితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం అవగాహన పోస్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్‌, సైబర్‌ క్రైం సీఐ రవీందర్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement