దహెగాం: మండలంలోని చినరాస్పెల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థా యి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం సునీత తెలిపారు. బుధవారం పాఠశాల ఆవరణలో విద్యార్థినులను అభినందించారు. ఆసిఫాబాద్‌లో మంగళవారం జరిగిన జూనియర్ బాలికల ఫుట్‌బాల్ పోటీల్లో పదో తరగతి విద్యార్థిని పాలె అంజలి, తొమ్మిదో తరగతి విద్యార్థిని పాలె శ్రావణి సత్తా చాటారని తెలిపారు. వీరు ఈ నెల 4 నుంచి 6 వరకు నిజామాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీ రవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


