‘ప్రశస్త్‌ 2.0’ షురూ | - | Sakshi
Sakshi News home page

‘ప్రశస్త్‌ 2.0’ షురూ

Sep 3 2026 4:09 AM | Updated on Sep 3 2026 4:09 AM

● పాఠశాలలకు సీఆర్‌పీలు, ఐటీసీ బోధకులు ● ఈ నెల 11 వరకు కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆదేశాలు

కెరమెరి: పాఠశాలల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌ విద్యాలయ రేటింగ్‌(ఎస్‌హెచ్‌వీఆర్‌), ప్రశస్త్‌ 2.0 కార్యక్రమాలు బుధవారం నుంచి జిల్లాలో ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ 11లోగా కార్యక్రమాలు వందశాతం పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. దీంతో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ఉదయమే సీఆర్‌పీలు, ఐసీటీ బోధకులు పాఠశాలల బాట పడుతున్నారు. ఉపాధ్యాయులతో ప్రశస్త్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించి 10 వీడియోలను చూసేలా అవగాహన కల్పిస్తున్నారు.

ప్రత్యేక యాప్‌ రూపకల్పన

చిన్నతనం నుంచి పిల్లల్లో భౌతిక, మానసిక ఎదుగుదల, మార్పులను గుర్తించడం కష్టంగా మారుతుంది. అయితే ఇలాంటి ప్రత్యేక లక్షణాలను గుర్తించడానికి ఎన్‌సీఈఆర్‌టీ(న్యూఢిల్లీ) ప్రత్యేకంగా ప్రశస్త్‌ యాప్‌ రూపొందించింది. విద్యార్థుల మానసిక ప్రవర్తన, భౌతికంగా వచ్చిన మార్పులను దీని ద్వారా గుర్తించవచ్చు. యూడైస్‌తో దేశంలోని అన్ని పాఠశాలల విద్యార్థుల వివరాలు ఒకే వేదికపై ఉంటాయి. యాప్‌ ద్వారా పిల్లల స్క్రీనింగ్‌ చేయడం సులభం. ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని ముందుగానే గుర్తించడానికి దోహదపడుతుంది. ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్‌ –2016 ప్రకారం 21 రకాల అసమానతలను గుర్తించడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.

పాఠశాలలకు సీఆర్‌పీలు

జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద 1267 పాఠశాలలు ఉన్నాయి. స్కూల్‌ కాంప్లెక్స్‌లు 67 ఉండగా, సీఆర్‌పీలు 52 మంది పనిచేస్తున్నారు. క్లస్టర్‌ పరిధిలోని అన్ని పాఠశాలల్లో రిజిస్ట్రేషన్‌, స్వీయ మూల్యాంకనం గడువులోగా పూర్తయ్యేలా చూసే బాధ్యతలను కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. సాంకేతిక సహకా రం అందించేందుకు సీఆర్‌పీలు(కాంప్లెక్స్‌ రిసోర్స్‌ పర్సన్లు), ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు ఐదు రోజులపాటు క్షేత్రస్థాయిలో అన్ని పాఠశాలలను నేరుగా సందర్శిస్తారు. ఇందుకోసం వారికి ప్రయాణ భత్యం కూడా మంజూరు చేయనున్నారు. పిల్లల్లో శారీరక, మానసిక లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రశస్త్‌ 2.0 పోర్టల్‌ను తీసుకువచ్చింది. ఉపాధ్యాయులు తమ యూడైస్‌ కోడ్‌, రిజిస్టర్డ్‌ ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ అయి శిక్షణ వీడియోలు వీక్షించాలి. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థుల ప్రవర్తనను నిశితంగా పరిశీలించి సమస్యలు గుర్తించాలి.

‘హరిత్‌ పాఠశాల’ రేటింగ్‌ ఇలా..

స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌ విద్యాలయ రేటింగ్‌లో పాఠశాల నిర్వహణ, పచ్చదనం, పారిశుద్ధ్యం కలిపి మొత్తం 125 మార్కులకు స్టార్‌ రేటింగ్‌ కేటాయిస్తారు.

తాగునీటి సౌకర్యం 22

మరుగుదొడ్ల నిర్వహణ 27

సబ్బుతో చేతులు కడుక్కోవడం 14

ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ 21

ప్రవర్తన సామర్థ్య పెంపు 20

మిషన్‌ లైఫ్‌ కార్యక్రమాలు 21

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement