కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్‌ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్‌

Sep 3 2026 4:09 AM | Updated on Sep 3 2026 4:09 AM

● ఎమ్మెల్యే కోవ లక్ష్మి ● జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా

ఆసిఫాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే నివాసం నుంచి గాంధీచౌక్‌, వివేకానంద చౌక్‌, అంబేడ్కర్‌ చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు కాంగ్రెస్‌ బాకీ కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్‌ వైఫల్యాలతో రూపొందించిన 420 అడుగుల ఫ్లెక్సీతో అంబేడ్కర్‌ చౌక్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీలు నీటముటలుగా మిగిలిపోయాయన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులతో పాటు అన్నివర్గాల ప్రజలు మోసపోయారన్నారు. కల్యాణలక్ష్మి నిలిచిపోయిందని, నిరుద్యోగ భృతి రూ.4వేలు, తులం బంగారం, స్కూటీ హామీలు గాలికొదిలేశారని ఆరోపించారు. 22ఏ పేరుతో ప్రైవేట్‌ భూములను నిషేధిత జాబితాలో చేర్చారని మండిపడ్డారు. జిల్లా వైద్య కళాశాలలో వైద్యులు లేరని, ఆసిఫాబాద్‌ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. 1000 రోజుల పాలనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఆరు గ్యారంటీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ సీనియర్‌ నాయకురాలు మర్సోకోల సరస్వతి, మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె ఆకాశ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎండీ అహ్మద్‌, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సాలం, బాలకృష్ణ, దూడల అశోక్‌, నాగుబాయి, రాజంపేట సర్పంచ్‌ బుర్స పోచయ్య, ఉప సర్పంచ్‌ మామిడి లక్ష్మి, పార్టీ నాయకులు అబుల్‌ కలాం, గంధం శ్రీనివాస్‌, సాయి శ్రావణ్‌, జాబరి రవీందర్‌, నిసార్‌, అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement