విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలి | - | Sakshi
Sakshi News home page

విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలి

Sep 3 2026 4:09 AM | Updated on Sep 3 2026 4:09 AM

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో ఎంఈవోలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి డీఈవో సచ్చిదానంద చారితో కలిసి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యాకార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలన్నారు. మానసిక, సామాజిక, శారీరక, సృజనాత్మక, నైతిక విలువలు పెంపొందించడంపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో ఎస్‌వోలు శ్రీనివాస్‌, అబిద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

గడువులోగా సిలబస్‌ పూర్తి చేయాలి

రెబ్బెన: ఇంటర్‌ విద్యార్థుల సిలబస్‌ను గడువులోగా పూర్తి చేసి, వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. రెబ్బెన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరు, తరగతి గదులు, విద్యాబోధన తీరుతోపాటు కళాశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని సందర్శించారు. రోగులతో మాట్లాడి సేవల గురించి తెలుసుకున్నారు. చిన్న చిన్న కారణాలతో రోగులను ఇతర ప్రాంతాలకు సిఫార్సు చేయవద్దని సూచించారు. గర్భిణులపై దృష్టి సారించి, సుఖప్రసవాలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమాల్లో కళాశాల ప్రిన్సిపాల్‌ నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement