సెపక్‌ తక్రా పోటీలకు గోలేటి క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

సెపక్‌ తక్రా పోటీలకు గోలేటి క్రీడాకారులు

Sep 3 2026 4:09 AM | Updated on Sep 3 2026 4:09 AM

రెబ్బెన: జాతీయస్థాయి సెపక్‌ తక్రా పోటీలకు రెబ్బెన మండలం గోలేటికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికైనట్లు అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ కుమ్మరి మల్లేశ్‌, పీఈటీ భాస్కర్‌ తెలిపారు. వరంగల్‌ జిల్లా బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన సెలక్షన్‌ ట్రయల్స్‌లో గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో గంగాధరి శివచరణ్‌(9వ తరగతి), చీదురాల హరీశ్‌(8వ తరగతి) ప్రతిభ చూపారన్నారు. వీరు జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌, షేర్‌ కశ్మీర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగే 29వ జాతీయస్థాయి సెపక్‌తక్రా పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరుఫున పాల్గొంటారని పేర్కొన్నారు. క్రీడాకారులను అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారాయణరెడ్డి, సెపక్‌తక్రా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శిరీష, సభ్యులు రామకృష్ణ తదితరులు అభినందించారు.

శివచరణ్‌

హరీశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement