వెయ్యి రోజుల్లో ఏం చేశారో చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

వెయ్యి రోజుల్లో ఏం చేశారో చెప్పాలి

Sep 2 2026 2:58 AM | Updated on Sep 2 2026 2:58 AM

● బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం

ఆసిఫాబాద్‌అర్బన్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ఏం చేశారో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, కొన్ని బీటెక్‌ కళాశాలలు, యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి వద్దే విద్యాశాఖ ఉన్నా సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వివాదాలకు కారణమవుతుందన్నారు. భూభారతి పేరుతో ప్రైవేట్‌ భూములను సైతం ప్రభుత్వ జాబితాలో చేర్చి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్‌, నాయకులు ఖాండ్రె విశాల్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సుచిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement