మా అమ్మాయి పెళ్లి కోసం వడ్డీకి డబ్బు తెచ్చాం. కల్యాణలక్ష్మి డబ్బులు వస్తే చెల్లిద్దామనుకున్నాను. కానీ చెల్లని చెక్కు రావడం ఇబ్బందిగా మారింది. అప్పులకు ఇప్పటికీ వడ్డీ కడుతున్నా. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఓ లెటర్‌తో ఆర్డీవో కార్యాలయంలో చెక్కు ఇచ్చా. కానీ నేటికి కొత్త చెక్కు రాలేదు.
– పల్మటే అంబాబాయి, లేండిగూడ
వారంలో వచ్చే అవకాశం
చెక్కులను లబ్ధిదారులు ఆర్డీవో కార్యాలయంలో అందించా రు. వారంలో కొత్త చెక్కులు వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే సైతం లబ్ధిదారుల ఇబ్బందులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. జిల్లా అధికారుల వద్ద ఆరా తీస్తున్నారు.
– నాగార్జున, తహసీల్దార్, కెరమెరి


