ఆసిఫాబాద్‌అర్బన్: కాంగ్రెస్ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌తో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, పంటల కొనుగోళ్ల ద్వారా అండగా నిలిచిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ ఆర్థిక భారం తగ్గించిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు కొత్త రేషన్ కార్డులు, రూ.500లకే గ్యాస్ కనెక్షన్ సిలిండర్ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. బీఆర్‌ఎస్ శ్రేణులు జిల్లాలో కాకుండా, కేసీఆర్ ఫామ్‌హౌస్ ఎదుట నిరసనలు చేపట్టాలని హితవు పలికారు. సమావేశంలో ఏఎంసీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ, పార్టీ నాయకులు హర్షద్, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.


