భీంరావు సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

భీంరావు సేవలు చిరస్మరణీయం

Aug 29 2026 11:57 PM | Updated on Aug 29 2026 11:57 PM

● ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఉమ్మడి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రిగా కోట్నాక భీంరావు సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. దివంగత మంత్రి వ ర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పిల్లల పార్క్‌లో గల ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించారు. సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేశారు. భీంరావు విగ్రహానికి ఎమ్మెల్సీ దండె విఠల్‌, అదన పు కలెక్టర్‌ డేవిడ్‌, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, ఆదివాసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీల అభ్యున్నతి, అభివృద్ధికి కృషి చేసిన కోట్నాక భీంరావు ఆశయాలను ప్రతిఒక్కరూ కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ ఇరుకుల మంగ, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ ఎండీ అహ్మద్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సలాం, కార్తీక్‌, బాలకృష్ణ, ఆదివాసీ సంఘం నాయకులు అర్జు మాస్టర్‌, మడావి శ్రీనివాస్‌, బుర్స పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement